ETV Bharat / state

అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు: యుద్ధభూమిపై విద్యార్థుల ఆవేదన

Siddipet Students Stuck in Ukraine: యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. యుద్ధ వాతావరణంతో ఓ వైపు తినడానికి తిండి లేక, చేతిలో డబ్బులు లేక నానావస్థలు ఎదుర్కొంటున్నారు. చీకటి గదిలో ఉంటూ భారత అధికారుల ఫోన్​ కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యుద్ధప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్న వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు తమ పిల్లలను ఇంటికి రప్పించాలంటూ వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

Siddipet Students Stuck in Ukraine
ఉక్రెయిన్​లో చిక్కుకున్న సిద్దిపేట విద్యార్థులు
author img

By

Published : Feb 25, 2022, 3:41 PM IST

Updated : Feb 25, 2022, 6:54 PM IST

Siddipet Students Stuck in Ukraine: ఉక్రెయిన్​లో యుద్ధ వాతావరణంతో.. ఆ దేశంలోని తెలుగు విద్యార్థుల గుండెల్లో గుబులు అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రమాదం ఎటునుంచి పొంచుకువస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తినడానికి తిండి లేకపోవడతో ఆకలితో అలమటిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నా.. ఏటీఎంలు మూతపడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్​లో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా విద్యార్థులు.. భయం గుప్పిట్లో బతుకుతున్నారు. స్వదేశానికి చేరుకునే సమయం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ విద్యార్థులను.. స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉక్రెయిన్‌ అలజడిలో విద్యార్థులు.. ఆందోళనలో వారి తల్లిదండ్రులు

అమ్మా.. ఆకలేస్తుంది

Siddipet Students Stuck in Ukraine
తగరం మనాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన తగరం మనాలి.. జెఫ్రోసియాలో మెడిసిన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మరో ముగ్గురు తెలుగు విద్యార్థులతో కలిసి ఉంటోంది. ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండటంతో.. తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. తమకు తినడానికి ఆహారం లేదని, తాగడానికి సైతం మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మనాలి.. ఫోన్ ద్వారా తన తల్లి కవితకు తెలిపారు. గదిలో కూడా లైట్లు ఆఫ్ చేసి పెట్టుకోవాలని అధికారులు తెలిపారని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కింద ఉన్న బంకులోకి వెళ్లాలని సూచించారని చెప్పారు. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని తమను వేరే ప్రదేశానికి బస్సులో తరలించి అక్కడినుంచి విమానం ఏర్పాటు చేసి.. మన దేశానికి తరలిస్తారని తెలిపారని తల్లికి చరవాణిలో వివరించింది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు

"మా పాప.. జెఫ్రోసియాలో మెడిసిన్​ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఉక్రెయిన్​పై రష్యా యుద్ధంతో మా పిల్లల పరిస్థితి ఎలా ఉందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. భోజనం కూడా దొరకడం లేదట. రాత్రి వాళ్లు నిద్ర లేక భయం గుప్పిట్లో బతికామని మా పాప వాపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించాలి. గురువారం రాత్రి బండి సంజయ్​.. మా పాపతో వీడియో కాల్​ మాట్లాడారని తెలిసింది. క్షేమంగా స్వదేశానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు." -కవిత, మనాలి తల్లి

డబ్బులు కూడా లేవు

Siddipet Students Stuck in Ukraine
పున్న శ్రీకాంత్​(ఎడమ వైపు)

కోహెడకు చెందిన పున్న శ్రీశాంత్.... ఉక్రెయిన్​ వినిష్టియాలోని నేషనల్‌ మెడికల్‌ కాలేజ్‌లో మెడిసిన్​ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. రెండు నెలల క్రితమే అక్కడికి వెళ్లారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులతో ప్రస్తుతం హాస్టల్‌లో ఉంటున్నట్లు శ్రీశాంత్‌ తెలిపారు. భోజన సౌకర్యం లేదని, డబ్బులు సైతం అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని వీడియో మెసేజ్‌ పంపారు. ఇండియన్‌ ఎంబసీ నుంచి తమకు సహకారం అందటంలేదని వాపోతున్నారు. 'సురక్షితంగానే ఉన్నాం.. కానీ.. ఏం జరుగుతుందో?'

"ఈ నెల 26కు ఇండియాకు విమానం బుక్​ చేసుకున్నాం. కానీ విమానాలు ఆపేశారు. యుద్ధ పరిస్థితులతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. తినడానికి తిండి లేదు, మంచి నీళ్లు కూడా లేవు. బయట స్టోర్లు కూడా మూసేశారు. ఏటీఎంలు బంద్​ ఉన్నాయి. చేతిలో డబ్బులు లేవు. ఆపద వస్తే బంకర్లలోకి, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లమంటున్నారు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. మమ్మల్ని గైడ్​ చేసేవాళ్లు లేరు. ఇండియన్​ ఎంబసీ నుంచి మాకు ఎటువంటి భరోసా లేదు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకొని త్వరగా స్వదేశానికి తరలించాలి." -శ్రీశాంత్​, కోహెడ వాసి

ఏ ప్రాంతంలో ఉన్నాడో తెలియదు

Siddipet Students Stuck in Ukraine
విశాల్​ కిరణ్​

కాగా ఇదే జిల్లాలోని హుస్నాబాద్​కు చెందిన మరో వైద్య విద్యార్థి జనగాని విశాల్ కిరణ్ ఉక్రెయిన్​లో ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడని.. మరో నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తవుతుందని విశాల్ కిరణ్ తండ్రి డాక్టర్ తిరుపతి తెలిపారు. ప్రస్తుతం ఉక్రెయిన్​లోనే క్షేమంగా ఉన్నట్లు విశాల్ కిరణ్ ఉదయం ఫోన్ చేసి మాట్లాడాడని.. అధికారుల సూచనమేరకు స్నేహితులతో గదిలోనే ఉంటున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. ఉదయం నుంచి మళ్లీ ఫోన్ చేస్తే కలవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ కిరణ్ ఉక్రెయిన్​లో ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు.

ఇదీ చదవండి: క్షేమంగానే ఉన్నా.. వెంటాడుతున్న బాంబుల భయం..

Last Updated : Feb 25, 2022, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.