సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామంలో రైతులకు పీఎసీఎస్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఎరువులు అందించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా రైతులు ఎరువుల కొరత వల్ల ఇబ్బంది పడకుండా తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నట్టు తెలిపారు.
రైతులుకు ముందస్తుగానే.. ఎరువులు అందించి.. వారిని పంటసాగుకు సిద్ధం చేసే దిశగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ వానాకాలానికి సరిపడా ఎరువులు పొందాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలీస్ రాజు, సర్పంచ్ కిష్టయ్య, కో ఆప్షన్ సభ్యుడు హైమద్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'