సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున స్వామివారి 'పెద్దపట్నం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకుముందు గర్భాలయంలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా జరిపించారు.
రాత్రంతా జాగారాలు చేసిన భక్తులు 'పెద్దపట్నం' తొక్కేందుకు ఉత్సాహం కనబరిచారు. ముందుగా ఆలయ పూజారులు ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం దాటగా.. అనంతరం భక్తులను అనుమతించారు. వారంతా ఒక్కసారిగాకి దూసుకురావడంతో కాసేపు తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు వారిని నిలువరించి క్రమపద్ధతిలో పంపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి: వైభవంగా మహాశివరాత్రి వేడుకలు... భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు