ETV Bharat / state

మల్లన్న సాగర్​ పనుల్లో అపశృతి, విద్యార్థి మృతి - మరో విద్యార్థి ప్రాణం మింగేసిన మల్లన్న సాగర్ కాలువ

కాలేశ్వరం ప్రాజెక్టు భాగంలో మల్లన్న సాగర్ మధ్య కాల్వ పనులలో జరిగిన బ్లాస్టింగ్ వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. బ్లాస్టింగ్ వల్ల ఎగిరిపడ్డ శకలాలు వచ్చి పక్కనే వసతిగృహంలో ఉన్న విద్యార్థిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

మల్లన్న సాగర్ కాలువ పనుల్లో అపశృతి
author img

By

Published : May 17, 2019, 8:13 PM IST

Updated : May 17, 2019, 9:33 PM IST

మల్లన్న సాగర్​ పనుల్లో అపశృతి, విద్యార్థి మృతి

సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల శివారులో దారుణం జరిగింది. మల్లన్న సాగర్ మధ్య కాల్వ పనుల్లో భాగంగా జరిగిన బ్లాస్టింగ్​లో ఓ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్​గా గుర్తించారు. ప్రస్తుతం సురేష్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఉన్నందున వసతి గృహం మేడపై చదువుకుంటున్నాడు. పక్కనే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగి ఓ రాయి వచ్చి సురేష్ తలపై పడింది. తీవ్రగాయమై సురేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. తోటి విద్యార్థులు చూసి వెంటనే పోలీసులకు సమాచారమందిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుతాసుపత్రికి తరలించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇప్పటికే ఓ విద్యార్థి మృతి చెందాడని ప్రస్తుతం మరో విద్యార్థి చనిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపించారు. సురేష్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

స్పందించిన ఎమ్మెల్యే హరీశ్​రావు

డిగ్రీ విద్యార్థి మృతి ఘటనపై ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థి మృతి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హరీశ్‌రావు. ఘటనపై విచారణ జరపాలని అధికారులకు హరీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఇవీ చూడండి: అమ్మో కూర'గాయం'... వాటి కంటే పచ్చళ్లు నయం

Intro:TG_SRD_72_17_MRUTHI_SCRIPT_C4

యాంకర్: కాలేశ్వరం ప్రాజెక్టు భాగంలో మల్లన్న సాగర్ మధ్య కాల్వ పనులలో విధిగా బ్లాస్టింగ్ జరుగుతున్న తరుణంలో లో శకలాలు పక్కనే ఉన్న హాస్టల్ పైకి వచ్చి విద్యార్థి తలపై తగలడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల శివారులో జరిగింది.

Body:విద్యార్థి మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్టి సురేష్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఉండగా హాస్టల్ పై చదువుకుంటుండగా పక్కనే జరుగుతున్న కాలువ పనులలో బ్లాస్టింగ్ కావడంతో రాయి ఎగిరి వచ్చి సురేష్ తలపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Conclusion:తోటి విద్యార్థులు చూసి హుటాహుటిన స్థానికులకు పోలీసులకు సంప్రదించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా కాలువ పనులు విద్యార్థులు సైతం పొట్టన పెట్టుకుంది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటామని వారికి న్యాయం జరిగే విధంగా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Last Updated : May 17, 2019, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.