సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహా గౌరీదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని కాంగ్రెస్ నేతలు బోసు రాజు, పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉండేలా చూడమని కోరుకున్నారు.
మహా గౌరీదేవి అమ్మవారికి ఆలయ వ్యవస్థాపకులు రాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో పంచామృతాలతో అభిషేకించారు. అమ్మవారి సన్నిధిలో.. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. గౌరీదేవి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
- ఇదీ చదవండి : సావిత్రి: పాతివ్రత్యానికే కాదు.. పట్టుదలకూ ప్రతీక