ETV Bharat / state

ఆరోగ్యం, ఆహ్లాదం కోసమే ప్రకృతి వనాలు: హరీశ్​రావు - హరీశ్​రావు వార్తలు

సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కులను హరీశ్​రావు ప్రారంభించారు. ఆరోగ్యం, ఆహ్లాదం కోసం ప్రకృతి వనాలు, అర్బన్​ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

harish rao
ఆరోగ్యం, ఆహ్లాదం కోసమే ప్రకృతి వనాలు: హరీశ్​రావు
author img

By

Published : Feb 3, 2021, 5:49 AM IST

ఆరోగ్యం, ఆహ్లాదం కోసం సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్థ(సుడా) ఆధ్వర్యంలో ప్రకృతి వనాలు, అర్బన్​ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామంలో పార్కులను జడ్పీ ఛైర్​పర్సన్​ రోజాశర్మతో హరీశ్​రావు ప్రారంభించారు.

సుడా ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ ఆవరణలలో రూ.52.58 లక్షల వ్యయంతో.. 3.15 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. 5 లక్షల మొక్కల సామర్థ్యంతో 46 రకాల మొక్కలు ఉంచినట్లు తెలిపారు. రంగనాయక సాగర్ ఆవరణలోనే రూ.9.30 లక్షలతో ట్రీ పార్క్​ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 1.25 ఎకరాల ట్రీ పార్కులో 70 రకాల.. 9,800 మొక్కలను ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో సుడా ఛైర్మన్​ రవీందర్​రెడ్డి, వైస్​ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఓ వరం..

ముఖ్యమంత్రి సహాయనిధి.. పేదలకు ఓ వరమని ఆర్థిక మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 30 మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​ రాజనర్సు, ఏఎంసీ ఛైర్మన్​ పాలసాయిరాం, సుడా ఛైర్మన్​ రవీందర్​రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

harish rao
సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు అందిస్తున్న హరీశ్​రావు

ఇవీచూడండి: ఓడిపోయిన వారే ఎక్కువ పాఠాలు నేర్చుకుంటారు: రామ్​చరణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.