ETV Bharat / state

రాబోయే ఎన్నికల్లో తెరాసకే ఓటు వేస్తామని తీర్మానం

author img

By

Published : Sep 16, 2020, 6:47 AM IST

సిద్దిపేట జిల్లా నర్సంపేట గ్రామస్థులంతా రాబోయే ఎన్నికల్లో తెరాసకే తమ ఓటు అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిని మంత్రి హరీశ్​రావుకి అందజేశారు. నర్సంపేటలో తెరాస జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

narsampet village people decision to vote for trs in the upcoming elections
రాబోయే ఎన్నికల్లో తెరాసకే ఓటు వేస్తామని తీర్మానం

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం నర్సంపేటలో మంత్రి హరీశ్​రావు తెరాస జెండాను ఆవిష్కరించారు. గ్రామస్థులంతా తెరాసకే తమ ఓటు అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిని మంత్రికి అందజేశారు.

సాధారణ ఎన్నికల సమయంలో కూడా నర్సంపేట ప్రజలు తెరాసకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా మంత్రి అభినందనలు తెలిపారు.

షేర్​పల్లి బందారం నుంచి నర్సంపేటను వేరు చేయాలన్న గ్రామస్థుల వినతిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హరీశ్​రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జడ్పీ ఛైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్​డీపీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ మండలాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : దేశంలో అత్యుత్తమ‌ న‌గ‌రంగా హైద‌రాబాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.