సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. శరీరం నుంచి తల, చేతిని వేరుచేసి నరికి చంపారు దుండగులు. మృతుడు సిద్దిపేట మండలం ఇమామ్బాద్ గ్రామానికి చెందిన అంబటి ఎల్లంగౌడ్గా పోలీసులు గుర్తించారు.
పాతకక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎల్లంగౌడ్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.