ETV Bharat / state

మొక్కే కదా అని పీకేస్తే.. జరిమానా, జైలుశిక్ష తప్పదు - సిద్దిపేట పురపాలక ఉద్యాన అధికారి ఐలయ్య ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా అని ఓ సినిమాలో హీరో హెచ్చరిస్తాడు. మొక్కే కదా అని పీకేస్తే.. వేల రూపాయల జరిమానాలు విధిస్తూ.. కోర్టు మెట్లు ఎక్కిస్తూ.. అమ్మో అనిపిస్తున్నాడు ఓ అధికారి. మొక్కలకు.. చెట్లకు ఎదైనా హనీ కలిగిస్తే.. కన్న కొడుకునైన వదిలిపెట్టనంటున్న సిద్దిపేట పురపాలక ఉద్యాన అధికారి ఐలయ్యపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

municipal-horticulture-officer-ilaiah-is-a-plant-protector-in-siddipet-district
మొక్కే కదా అని పీకేస్తే.. జరిమానా, జైలుశిక్ష తప్పదు
author img

By

Published : Feb 9, 2020, 6:04 AM IST

మొక్కే కదా అని పీకేస్తే.. జరిమానా, జైలుశిక్ష తప్పదు

పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక మంత్రి హరీశ్​రావు... మొదటి నుంచి తన నియోజకవర్గం సిద్దిపేటలో విరివిగా మొక్కలు నాటించారు. హరితహారం పథకం ద్వారా సిద్దిపేటలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లక్షల్లో మొక్కలు నాటించారు. మొదటి, రెండో విడతల్లో నాటినవి చెట్లుగా ఎదిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొందరు హరిత స్ఫూర్తిని అందుకోలేక... అవగాహన లోపంతో... మొక్కలను, చెట్లను ధ్వంసం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హరీశ్​... నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా పురపాలక సంఘం పరిధిలో హరితహారానికి ప్రత్యేక అధికారిని నియమించారు.

తప్పు చేస్తే... జరిమానా... జైలు శిక్ష

సిద్దిపేట పురపాలక సంఘం హరితహారం ప్రత్యేకాధికారి ఐలయ్య. ఉదయమే ద్విచక్రవాహనంపై పట్టణంలో ప్రతి రోడ్డు తిరిగి మొక్కలను పరిశీలిస్తారు. ఎక్కడైనా మొక్కలను, చెట్లను ధ్వంసం చేసినట్లు ఉంటే.. కారకులను గుర్తించే ప్రయత్నం మొదలు పెడతాడు. స్థానికులను విచారిస్తాడు. దానితో పాటు.. సీసీ కెమేరా ఫుటేజీ పరిశీలించి.. ధ్వంసం చేసిన వారిని గుర్తిస్తాడు. వారికి వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు... వారితోనే కొత్త మొక్కలు తెప్పించి... నాటించి.. సంరక్షణ బాధ్యతల హామీ తీసుకుంటాడు. తీవ్రత ఎక్కువ ఉంటే పోలీసు కేసు సైతం నమోదు చేస్తున్నాడు. ఇప్పటివరకు 36 మందిపై జరిమానాలు విధించగా... ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.

మొక్కల సంరక్షకుడు

ఐలయ్య దినచర్య ఉదయం 5 గంటలకు ప్రారంభమై... దాదాపు రాత్రి 8 గంటల వరకు సాగుతుంది. పట్టణ పరిధిలోని 35 వార్డుల్లోని మొక్కల సంరక్షణ కోసం ఇతని ఆధ్వర్యంలో 13నీళ్ల ట్యాంకర్లు, 30మంది కూలీలు ఉన్నారు. ఉదయమే పట్టణంలో పర్యటించి ఎక్కడ మొక్కలు ఎండిపోయాయి.. ఎక్కడ కలుపు మొక్కలు పెరిగాయో గుర్తించి.. కూలీల ద్వారా ఆ పనులు చేపిస్తారు. ట్యాంకర్లు సక్రమంగా మొక్కలకు నీళ్లు పోసేలా చూస్తారు.

మొక్కను ముట్టుకోవాలంటనే భయపడేలా చేస్తున్న ఐలయ్య లాంటి అధికారి ప్రతి ఊరికి అవసరం. అప్పుడే ప్రతి ఊరు పచ్చని పందిరి అవుతుంది.

ఇవీ చూడండి: ముగింపు దశకు మేడారం జాతర.. కాసేపట్లో అమ్మవార్ల వన ప్రవేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.