ETV Bharat / state

'సంచలన ఘటనతో ఫేమస్ అయ్యేందుకే ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి నిందితుడు రాజుకు ఎవరి సహకారం లేదు' - ఎంపీ కత్తిదాడి కేసు నిందితుడు రాజుకు రిమాండ్

MP Kotha Prabhakar Reddy Knife Attack Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తి దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. ఏదైనా సంచలన ఘటన చేసి తాను అందరి దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఈ ఘతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని సిద్దిపేట సీపీ శ్వేత వెల్లడించారు.

MP Kotha Prabhakar Reddy Knife Attack Case Updates
MP Knife Attack Accused Raju Remanded
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 7:54 PM IST

Updated : Nov 1, 2023, 8:05 PM IST

MP Kotha Prabhakar Reddy Knife Attack Case Updates : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న.. దుబ్బాక బీఆర్​ఎస్​ అభ్యర్థి కొత్త ప్రభాకర్​రెడ్డిపై దాడి చేసిన నిందితుడు రాజును పోలీసులు గజ్వేల్ జ్యుడీషియల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

Political Parties Reaction on MP Knife Attack : మరో 4 రోజులు ఐసీయూలోనే చికిత్స.. కోడికత్తంటూ అపహాస్యం చేసినవారిపై హరీశ్​రావు కౌంటర్

ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై కత్తి దాడి కేసు వివరాలను.. సిద్దిపేట సీపీ శ్వేత వివరించారు. అక్టోబర్ 30న మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన రాజు.. ఎంపీని కలవడానికి వచ్చి చేతులు కలపబోయి కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రథమ చికిత్స అందించినట్లు తెలిపారు.

ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయిన అనంతరం విచారించగా.. ఏదైనా సంచలనమైన సంఘటన చేసి తాను అందరి దృష్టిలో పడాలని ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. వారం రోజుల క్రితం బహిరంగ మార్కెట్​లో కత్తి కొనుగోలు చేశాడని.. ఎంపీపై దాడి చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి పలు యూట్యూబ్​ న్యూస్​ ఛానెళ్లలో రిపోర్టర్​గా పని చేస్తున్నాడని.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని విచారణలో తేలిందన్నారు.

ఇంతవరకు ఇతనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. నిందితుడు రాజును అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్​కు పంపించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఎంపీపై దాడి చేయడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? లేదా దాడికి ఎవరైనా ప్రోత్సహించారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. సమగ్ర దర్యాపు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గన్​మెన్​ ప్రభాకర్ నుంచి కత్తి, పాస్టర్ అంజయ్య వద్ద నుంచి నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో డిపాజిట్ చేశామన్నారు. కొందరు వ్యక్తులు ఈ ఘటనపై అవాస్తవాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని.. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ శ్వేత హెచ్చరించారు.

"ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలని.. ఎంపీపై కత్తితో దాడికి పాల్పడినట్లు నిందితుడు రాజు ఒప్పుకున్నాడు. కొత్త ప్రభాకర్​రెడ్డిపై దాడి చేయడానికి ముందే ప్రణాళిక వేసుకున్నాడు. వారం క్రితం మార్కెట్​లో కత్తి కొనుగోలు చేశాడు. అక్టోబర్​ 30న సూరంపల్లిలో ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ కేసులో వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం". - శ్వేత, సీపీ సిద్దిపేట

సంచలన ఘటనతో ఫేమస్ అయ్యేందుకే ఎంపీ ప్రభాకర్​రెడ్డిపై కత్తితో దాడి వెల్లడించిన సిద్దిపేట సీపీ

Harish Rao On MP Kotha Prabhakar Reddy Health : 'ఎంపీపై దాడి జరిగితే.. కోడి కత్తి అంటూ అపహాస్యం చేస్తారా?'

MP Kotha Prabhakar Reddy Health Bulletin : కొత్త ప్రభాకర్​రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ.. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్న వైద్యులు

Last Updated : Nov 1, 2023, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.