ETV Bharat / state

నర్సింలు కుటుంబానికి కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి

కేసీఆర్​ సొంత నియోజకవర్గం గజ్వేల్​లోని వేలూరులో దళిత రైతు నర్సింలు కుటుంబానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దళితులపై వరుస దాడులను ఖండించారు.

mp komati reddy demands kcr has to apologize to narasimhulu family
నర్సింలు కుటుంబానికి కేసీఆర్​ క్షమాపణ చెప్పాలి: కోమటిరెడ్డి
author img

By

Published : Jul 31, 2020, 6:11 PM IST

ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్​లోని వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న దళిత రైతు నర్సింలు కుటుంబానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆ మొత్తాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు బాధిత కుటుంబానికి అందజేశారు. ఎంపీ కోమటిరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో నర్సింలు పురుగుల మందు తాగి మరణించడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, వారికి మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పి.. ఇప్పటికే తెరాస ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. భూమిని అన్యాయంగా లాక్కొని నర్సింలు ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందని మండిపడ్డారు.

మహబూబ్​నగర్ జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన దళిత యువకుడిపై టిప్పర్ ఎక్కించి హత్య చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. గతంలో సిరిసిల్ల నియోజకవర్గం నెరేళ్లలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బడుగు, బలహీన వర్గాలపైనా ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. దళితులపై జరుగుతున్న వరుస దాడులు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని కోమటిరెడ్డి అన్నారు. నర్సింలు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించాలని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆ కుటుంబానికి మూడెకరాలు భూమి, రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.

ఇవీచూడండి: 'నర్సింహులు విషయంలో ప్రతిపక్షాలవి శవ రాజకీయాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.