పల్లెటూర్లే దేశానికి పట్టుకొమ్మలాంటివని బండి సంజయ్ అన్నారు. అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి.. ఖర్చు చేసినప్పుడు అభివృద్ధి వేగవంతం అవుతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, దాచారం గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీగా గెలిచిన నుంచి పార్లమెంట్ నిధులను వినియోగించుకుంటూ అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తున్నానని తెలిపారు.
కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో ఆకలి చావులు నివారించగలిగామని కొనియాడారు. ప్రతి పల్లె అభ్యున్నతి సాధించాలంటే అందరూ వారి వారి బాధ్యతను గుర్తించాలని అన్నారు. అనంతరం రాంసాగార్ గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ