అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన సిద్దిపేట జిల్లా మర్కూక్ పోలీస్‌స్టేషన్‌ను మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు నేడు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చొరవతో మండలంగా ఏర్పాటైన మర్కూక్‌లో మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని సంకల్పించారు.
రూ. 14 కోట్లు మంజూరైన ఈ భవనం పనులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు శరవేగంగా పూర్తి చేశారు. సిబ్బందికి నివాస సముదాయం, అతిథి గృహాలు, ఎస్ఐకి ప్రత్యేక గది కేటాయించారు. రిసెప్షన్, విచారణ గది, కాన్ఫరెన్స్ హాల్, అన్ని గ్రామాల సీసీటీవీలు వీక్షించేందుకు కంట్రోల్ రూమ్, వ్యాయామశాల, మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి : శంకుస్థాపన చేసిన రోజే.. 4 కంపెనీల ఒప్పందాలు