ETV Bharat / state

మత్స్యకారులకు బాసటగా..సంచార చేపల విక్రయ వాహనాలు అందజేత - మత్స్యశాఖ

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్ రావు మత్స్యశాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్- సంచార వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. మత్స్యకారులకు బాసటగా.. మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ వెహికిల్స్ నిలుస్తాయని, వీటివలన మత్స్యకారులకు ఆర్థిక పుష్టి, ప్రజలకు ఆరోగ్య పుష్టి కలుగుతుందని మంత్రి హరీశ్ చెప్పారు.

mobile fish retail out let vehicles
.సంచార చేపల విక్రయ వాహనాలు అందజేత
author img

By

Published : Jul 5, 2021, 2:21 PM IST

ఇప్పటి వరకూ చేపలను దిగుమతి చేసుకునే తెలంగాణ రాష్ట్రం.. ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్- సంచార వాహనాన్ని ప్రారంభించిన మంత్రి.. ఈ వాహనాలు మత్స్యకారులకు బాసటగా నిలుస్తాయని అన్నారు. సిద్ధిపేట సొసైటీ లబ్ధిదారు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులు కాముని భాగ్యమ్మ, తదితరులకు వాహనాలను అందించారు.

తొందరలోనే రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో చేపల సంచార వాహనాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్​తో పాటు జిల్లాల్లో కూడా సంచార చేపల విక్రయ వాహనాలను తెచ్చినట్లు చెప్పారు. . ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు రూ.10 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రస్తుతం100 కోట్ల బడ్జెట్​ను కేటాయించామన్నారు. దేశంలో కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని మంత్రి కొనియాడారు.

రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మత్స్యకారుడు ఖాళీగా ఉండకుండా ఉపాధి కల్పిస్తున్నామని, మొబైల్ వెహికిల్స్ ద్వారా నాణ్యమైన చేపలను అందిస్తామని, ముఖ్యంగా మహిళలకు ఈ వాహనాలను అందజేస్తే ఎంతో ఉపయోగకరమని మంత్రి హరీశ్ వెల్లడించారు. మహిళ సంఘ సభ్యులు చేపల విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు.

10లక్షల యూనిట్​లో 6లక్షలు ప్రభుత్వమే సబ్సిడీ అందిస్తున్నదని, మిగతా 4 లక్షలు లబ్ధిదారు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ వాహనంలో ఓవెన్, వెయింగ్ మిషన్, ప్యాబ్రికేట్ చేసిన గ్యాస్ స్టవ్, ట్రేలు.. ఇలా పూర్తిస్థాయిలో ఆధునిక పద్ధతిలో సామాగ్రి సమకూర్చినట్లు మంత్రి వివరించారు.

మహిళా మత్స్య పారిశ్రామిక సంఘ సభ్యులకు హైదరాబాదులో సంచార వాహన విక్రయాలపై శిక్షణ ఇప్పించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి మధుసూదన్​ను మంత్రి ఆదేశించారు. సిద్ధిపేట సొసైటీకి మరో రెండు యూనిట్లు ఉన్నాయని అవసరమైన మత్స్య కార ఔత్సాహికులు ముందుకు రావాలని మంత్రి కోరారు.

ఇది చదవండి:

Japan mudslide:వరదల్లో 80 మంది గల్లంతు- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.