మల్లన్నసాగర్, కొండపోచమ్మ భూ నిర్వాసితులకు అండగా నిలిచేందుకు ఆమరణ దీక్ష చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. సామర్థ్యానికి మించి భూసేకరణ చేపట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. నిర్వాసితులకు సరైన పరిహారం చెల్లించకుండా నిర్మాణాలను చేపడుతున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని ప్రజలు తిరగబడితే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పదవి కోల్పోక తప్పదని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆస్ట్రేలియా ఎన్నికల్లో అధికార పార్టీదే విజయం..!