దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచేందుకు... తెరాస, భాజపా నోట్ల కట్టలతో గ్రామాల్లోకి వస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్లో... ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మల్లన్నసాగర్లో దండుకున్న కమిషన్ను ఈ ఎన్నికల్లో తెరాస ఖర్చు పెడుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలో దివంగత నేత ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధే తప్ప... 7 ఏళ్ల పాలనలో తెరాస చేసింది శూన్యమన్నారు. అభివృద్ధి చేసే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి: అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కేసీఆర్