సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ ఏడాది లక్షా నలభైవేల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 30 శాతం మొక్కలు నాటామని తెలిపారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండి, రైతులు సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు అవసరమన్నారు.
హుస్నాబాద్‌లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున త్వరలోనే మంకీ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. యాదగిరి మొక్కలను కూడా తెప్పించి పట్టణంలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ రజిత, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు: మంత్రి సబిత