ETV Bharat / state

కరోనా కట్టడి చర్యలపై ఎమ్మెల్యే సమీక్ష - హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రి

ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. కరోనా కట్టడి చర్యలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా మూడో దశ విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

corona tightening measures
corona tightening measures
author img

By

Published : Jun 16, 2021, 10:49 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో.. వైద్యాధికారులతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమావేశమయ్యారు. కొవిడ్ బాధితులకు అందుతోన్న వైద్య సేవల గురించి వారినడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

కరోనా మూడో దశ విజృంభించే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. మాస్కులు ధరించడం వల్ల సీజనల్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి మురళీకృష్ణ, మున్సిపల్ ఛైర్​ పర్సన్ రజిత, తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Satyavathi Rathod: రైతుల సమావేశాల కోసమే ప్రత్యేక వేదికలు: సత్యవతి రాఠోడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.