ETV Bharat / state

కరోనాపై వచ్చే వదంతులను నమ్మొద్దు: ఎమ్మెల్యే సతీశ్​ - కరోనా అప్​డేట్స్​

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డును ఎమ్మెల్యే సతీశ్​కుమార్​ సందర్శించారు. వైరస్​ నివారణపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కరోనాపై వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

mla-satish-kumar-awareness-on-corona-virus-in-siddipeta-husnabad
కరోనాపై వచ్చే వదంతులను నమ్మొద్దు: ఎమ్మెల్యే సతీశ్​
author img

By

Published : Mar 18, 2020, 8:01 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా నివారణపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ హాజరయ్యారు. అలాగే ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్యే సందర్శించి.. వార్డులో తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు.

కరోనా నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ ముద్రవేయించిన కరపత్రాలను విడుదల చేశారు. కరచాలనం వద్దు నమస్కారం ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని సతీశ్​కుమార్​ సూచించారు.

గత ఆరు రోజుల క్రితం దుబాయ్ నుంచి హుస్నాబాద్​కు వచ్చిన తల్లీబిడ్డలకు గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. వారిరువురికీ నెగిటివ్ వచ్చిందని.. అందువల్ల హుస్నాబాద్ ప్రజలు కరోనా వైరస్ తమ ప్రాంతంలో వ్యాప్తి చెందిందనే వదంతులను నమ్మవద్దని ఎమ్మెల్యే అన్నారు.

కరోనాపై వచ్చే వదంతులను నమ్మొద్దు: ఎమ్మెల్యే సతీశ్​

ఇవీ చూడండి: రైతు రుణమాఫీకి నిధుల విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.