ETV Bharat / state

'త్వరలో పోలీస్ ఉద్యోగాలు.. సిద్ధమవ్వాలి యువతీ యువకులు'

జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా హుస్నాబాద్​లో హాఫ్ మారథాన్ పరుగు పోటీలను సీపీ జోయల్ డేవిస్​తో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచీ దాదాపు వెయ్యి మంది యువత పాల్గొనడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగాల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపాలని సీపీని కోరారు.

MLA starting the half marathon with CP Joel Davis
హాఫ్ మారథాన్ పోటీని సీపీ జోయల్ డేవిస్​తో కలిసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే
author img

By

Published : Jan 31, 2021, 2:38 PM IST

జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ పరుగు పోటీలను సీపీ జోయల్ డేవిస్​తో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభానికి ముందు యువతీ, యువకులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

డ్రోన్ కెమెరాలు..

హుస్నాబాద్ డివిజన్​తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపు వెయ్యి మంది పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా హుస్నాబాద్ ఎనే-అక్కన్నపేట అంబేద్కర్ చౌరస్తా మీదుగా.. తిరిగి హుస్నాబాద్ ఎనేకు చేరుకునే 21కే పరుగును ఎమ్మెల్యే, సీపీ జెండా ఊపి ప్రారంభించారు. పోటీ పర్యవేక్షణకోసం పోలీసుల డ్రోన్ కెమెరాలు వినియోగించారు.

Cultural events
సాంస్కృతిక కార్యక్రమాలు

తర్వాత 10కే, 5కే, యువతుల కోసం 5కే పరుగు పోటీలను ప్రారంభించారు. యువత భారీ సంఖ్యలో పాల్గొనడంతో హుస్నాబాద్ పట్టణంలోని ఎనే ప్రాంతంలో కోలాహలం నెలకొంది. రోడ్డు భద్రతకు సంబంధించి ప్రమాణం చేయించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందించారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తి..

హాఫ్ మారథాన్ నిర్వహించడం, దాదాపు వెయ్యి మంది ఈ పోటీలో పాల్గొనడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. గతంలో హుస్నాబాద్​లో 407 మందికి పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 100 మంది కొలువులు సాధించారని తెలిపారు.

Prizes for those who win in competitions
పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు

పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నందున శిక్షణ కేంద్రాన్ని హుస్నాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని సీపీ జోయల్ డేవిస్​ని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. హాఫ్ మారథాన్ పోటీలను నిర్వహించి విజయవంతం చేసినందుకు పోలీసులను, యువతీ, యువకులను సీపీ అభినందించారు.

ఇదీ చూడండి: మీ రెజ్యూమ్​ ఎలా ఉండాలి..?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.