సంక్షేమానికి, అభివృద్ధికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 18వ వార్డు తెరాస అభ్యర్థి గన్నె వనిత భూమిరెడ్డి తరఫున ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
స్థానికులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో పాటు, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ఓటర్లను మంత్రి ఎర్రబెల్లి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు'