సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్మించనున్న కళాశాల భవనం అదనపు తరగతి గదుల పనులను ఎమ్మెల్యే సోలిపోట రామలింగారెడ్డి సందర్శించారు. తరగతుల నిర్మాణానికి ఈ నెల 3న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే స్థల పరిశీలన చేశారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు లేకపోవడం వల్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్రంగన్న బోయిన రాములు, ఎంపీపీ గజ్జల సాయిలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తమిళిసైకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం