సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. ఇటీవల మరణించిన రైతుల కుటుంబీకులకు రైతు బీమా చెక్కులను అందజేశారు. రైతు బీమా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుదాఘాతంతో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే సత్వరమే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: 'హక్కుల పరిరక్షణకు బీసీలు ఉద్యమించాలి'