అధికార తెరాస ఎన్ని నాటకాలు ఆడినా... ఎన్ని జిమ్మిక్కులు చేసినా... దుబ్బాక నియోజకవర్గంపై భాజపా జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట, రామక్కపేట గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణ చేశారని విమర్శించారు. కేంద్రం నుంచి కోట్ల కొద్ది నిధులు వచ్చినా... రాలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి రఘునందన్ రావును గెలిపించి అసెంబ్లీకి పంపించాలని రాజాసింగ్ కోరారు.