ETV Bharat / state

నా మంచి మిత్రుడు సోలిపేట: ఎమ్మెల్యే మైనంపల్లి - ఎమ్మెల్యే సోలిపేట కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మైనంపల్లి

అనారోగ్యంతో మృతి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. సోలిపేట తనకు మంచి మిత్రుడని.. ఆయన కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని తెలిపారు.

mla-minapally-hanumantha-rao-visitation-to-the-mla-solipeta-family-in-siddipet-district
నా మంచి మిత్రుడు సోలిపేట: ఎమ్మెల్యే మైనంపల్లి
author img

By

Published : Aug 8, 2020, 7:14 AM IST

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చిట్టాపూర్ గ్రామాన్ని మైనం పల్లి సందర్శించారు. ఎమ్మెల్యే సోలిపేట కుటుంబీకులను కలిసి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోలిపేట రామలింగారెడ్డి తనకు మంచి మిత్రుడని, వారి కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు. రామలింగారెడ్డి మృతి దుబ్బాక నియోజక వర్గానికి, మెదక్ జిల్లాకు తీరని లోటని అన్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.