సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద శనివారం ఉదయం గల్లంతైన లారీ డ్రైవర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉదయం బస్వాపూర్ వంతెనపై వాగు ప్రవాహానికి లారీ కొట్టుకుపోగా.. అందులో ఉన్న క్లీనర్ సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవర్ మాత్రం ప్రవాహంలో కొట్టుకుని వెళ్లి ఒక చెట్టును పట్టుకుని మధ్యాహ్నం వరకు సహాయం కోసం అరుపులు వేస్తూ ఎదురుచూశాడు.
విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు.. అతన్ని ఎలాగైనా కాపాడాలంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. సీపీ జోయల్ డేవిస్ రెస్క్యూ బృందాలతో డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట తాడు సహాయంతో డ్రైవర్‌ను కాపాడేందుకు యత్నించగా.. ప్రవాహం ఎక్కువై డ్రైవర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.
అనంతరం హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టగా డ్రైవర్ ఆచూకీ లభ్యమవ్వలేదు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందం, బోటు సహాయంతో వాగులో గాలింపు చర్యలు చేపట్టింది. మళ్లీ నీటి ప్రవాహం పెరగగా.. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలను ఆపివేశారు.
ఇవీచూడండి: ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్