సర్దార్ పాపన్న గౌడ్... అన్ని కులాల వారు మర్చిపోలేని వ్యక్తని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు వద్ద మంత్రులు శ్రీనివాస్ గౌడ్, హరీశ్‌రావు పర్యటించారు. గొప్ప చరిత్ర గల వ్యక్తి సర్దార్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీరా పాలసీ తీసుకువచ్చామని చెప్పారు. నీరాస్టాల్ను కోమటి చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం కోమటి చెరువు వద్ద ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని గీత కార్మిక భవన నిర్మాణం కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'చట్టాలను సవరించండి... పార్లమెంట్లో చర్చించండి