ETV Bharat / state

Ministers on Shivraj singh: 'వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారిని అన్నట్లు ఉంది'

Ministers on Shivraj singh Chouhan: మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ చౌహాన్​పై రాష్ట్ర మంత్రులు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను విమర్శించే స్థాయి చౌహాన్​కు లేదని మండిపడ్డారు. జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్​ సింగ్​ చౌహాన్​ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ డిమాండ్​ చేశారు.

కేసీఆర్​ను విమర్శించే స్థాయి చౌహాన్​కు లేదు... విరుచుకుపడిన మంత్రులు

author img

By

Published : Jan 8, 2022, 5:08 PM IST

కేసీఆర్​ను విమర్శించే స్థాయి చౌహాన్​కు లేదు... విరుచుకుపడిన మంత్రులు

Ministers on Shivraj singh Chouhan: జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ నాయకులు ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ 14కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే భాజపా అడ్డుకుంటోదని హరీశ్‌రావు ఆరోపించారు. అవినీతిపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వంటి నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

నరహంతక చరిత్ర..

నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్​ సింగ్​ చౌహాన్​ సాధించింది ఏమిటని మంత్రి హరీశ్​ ప్రశ్నించారు. గొప్పగా పాలిస్తే తెలంగాణలో మధ్య ప్రదేశ్ కూలీలు ఎందుకుంటారని ఎద్దేవా చేశారు. రైతులను పిట్టల్లా కాల్చి చంపించిన నరహంతక చరిత్ర చౌహాన్​ది అంటూ మంత్రి హరీశ్​ మండిపడ్డారు. 2017లో మద్దతు ధర, రుణమాఫీ కోసం రైతులు ధర్నా చేస్తే.. మార్కెట్‌ యార్డులో పట్టపగలు ఆరుగురు రైతులను కాల్చి చంపారని ఆరోపించారు. వ్యాపం కుంభకోణంలో ఇంతవరకూ దోషులను తేల్చలేదన్న మంత్రి.. ఆ కేసులో ఎంతో మంది అదృశ్యమయ్యారని.. శివరాజ్‌, మంత్రులు, కుటుంబసభ్యులపై ఆరోపణలు వచ్చాయన్నారు.వ్యాపం కుంభకోణం కేసులో ఎవరికైనా శిక్ష పడిందా?.. సీఎంగా ఉన్న శివరాజ్‌సింగ్ ఏం చేస్తున్నారని మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు.

విమర్శించే హక్కు కూడా లేదు..

‘‘శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అవాకులు చవాకులు పేలారు. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్‌ సింగ్‌ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నట్లు ఉంది. శివరాజ్‌సింగ్‌కు తెరాసను, కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొని శివరాజ్‌సింగ్‌ సీఎం అయ్యారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదు. ఏ రంగంలో మధ్యప్రదేశ్‌ అభివృద్ధి సాధించింది?మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి?.కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పింది. -హరీశ్​ రావు, రాష్ట్ర మంత్రి

కేసీఆర్​ తలుచుకుంటే విమానం దిగగలిగే వారా?: గంగుల

కేసీఆర్​పై ఆరోపణలు చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​పై మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విరుచుపడ్డారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రులు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే శివరాజ్ సింగ్​కు భయమంటే ఏమిటో చూపే వాళ్లమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ తలుచుకుంటే విమానం దిగగలిగే వారా అన్న గంగుల కమలాకర్... అతిథిగా భావించారు కాబట్టే సురక్షితంగా వెళ్లగలిగారని వ్యాఖ్యానించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పాలన సరిగా లేకే మధ్యప్రదేశ్ ప్రజలు హైదరాబాద్ వలస వస్తున్నారన్నారు. మరోసారి తెలంగాణకు వస్తే మధ్యప్రదేశ్ వలస కార్మికులే అడ్డుకుంటారని చౌహాన్​ను గంగుల హెచ్చరించారు.

దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి: తలసాని

భాజపా సీఎంలు, సీనియర్ నేతలు సీనియర్ నేతలు పర్యాటకుల్లా వచ్చి కేసీఆర్​ను విమర్శిస్తున్నారని తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. కేసీఆర్​కు దమ్ముందో లేదో ప్రధాని మోదీని అడిగితే తెలుస్తుందన్నారు. ప్రజలను రెచ్చగొడుతున్న భాజపాకు.. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. దిల్లీ, మధ్యప్రదేశ్ లోనైనా.. భాజపా పాలిత రాష్ట్రాల్లోనైనా చర్చకు సిద్ధమని తలసాని అన్నారు.

కేసీఆర్​కు, చౌహాన్​కు పోలికే లేదు: శ్రీనివాస్​ గౌడ్​

సర్కారు ఏర్పాటులో తెరాసది రహదారి... శివరాజ్ సింగ్ చౌహాన్​ది అడ్డదారి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండి పడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణతో దేశంలో ఏ రాష్ట్రమూ పోటీ పడలేదన్నారు. పక్క రాష్ట్రంలో తెలంగాణతో పోటీ పడితే ఉద్యోగులకు ఒక శాతం ఎక్కువే ఇవ్వాలని.. కానీ 24శాతం ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శివరాజ్ సింగ్ సీఎంగా ఉండి మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మరో పదిసార్లు సీఎం అయినా.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి చేయలేరన్నారు.

"సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పోలికే లేదు. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్‌ సీఎం అయ్యారు. ప్రధాని, భాజపా సీఎంలు.. కేసీఆర్‌ను ప్రశంసించలేదా? భాజపా నేతలకు ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉందా?తెలంగాణ మాదిరిగా భాజపా పాలిత ప్రాంతాల్లో జీతభత్యాలు ఇస్తున్నారా?" -శ్రీనివాస్‌గౌడ్‌, రాష్ట్ర మంత్రి

బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే జీవన్​రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన శివరాజ్‌సింగ్ చౌహన్ పచ్చి అబద్దాలు చెప్పారని ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఉన్న పథకాలు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి వచ్చి ఆ రాష్ట్ర సీఎంను తిట్టిన సంస్కృతి లేదని ఆక్షేపించారు. భాజపా అంటే బేరగాళ్లు- జూటగాళ్ల పార్టీగా తయారైందని జీవన్ రెడ్డి విమర్శించారు. శివరాజ్‌ సింగ్ చౌహన్ బలవంతంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను కొనుక్కొని సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్‌ వ్యాపమ్‌ చౌహన్ హయాంలోనే అయిందనే విషయాన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.