ETV Bharat / state

'నేనెవరో తెలుసా.. మీ వ్యవసాయశాఖ మంత్రిని...' - agriculture minister niranjan reddy

రైతుల వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులతో మాట్లాడి సమగ్ర వ్యవసాయ విధానంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

minister-niranjan-reddy visit siddipet district
డిమాండ్​ ఉన్న పంటలనే సాగు చేయాలి: మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Jun 14, 2020, 10:45 PM IST

'నా పేరు నిరంజన్ రెడ్డి.. నేను మీ వ్యవసాయ శాఖ మంత్రిని' అంటూ.. రైతుల వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నారు.. మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ వెళ్తున్న మంత్రి.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులను చూసి వారి వద్దకు వెళ్లి మాట కలిపారు. విత్తనాలు, ఎరువుల లభ్యత గురించి మంత్రి ఆరా తీశారు. ఎక్కడ కొన్నారు.. ఇవి నాణ్యమైనవేనా?.. అని రైతులను అడిగారు.

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సమగ్ర వ్యవసాయ విధానం, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపైన అన్నదాతల అభిప్రాయం అడిగారు. ప్రభుత్వానికి సహకరించాలని.. మీకు సర్కారు అండగా ఉంటుందని రైతులకు సూచించారు. సాంప్రదాయ వ్యవసాయం లాభసాటి కాదని.. కాలానికి అనుగుణంగా మారాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని వివరించారు.

ఇవీ చూడండి: ఎరువుల కర్మాగారాన్ని పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.