ETV Bharat / state

'పదో తరగతి విద్యార్థులు పత్తి ఏరేందుకు అస్సలు పోవద్దు...'

author img

By

Published : Nov 20, 2019, 1:57 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి... విద్యాధికారులకో సమీక్షించారు. కేజీబీవీ విద్యార్థులతో ముచ్చటించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.

MINISTER HARISHRAO ON KGBV 10TH CLASS STUDENTS PASS PERCENTAGE

పదో తరగతి విద్యార్థులు ఎట్టిపరిస్థితిలో పత్తి ఏరేందుకు వెళ్లటానికి వీళ్లేదని మంత్రి హరీశ్​రావు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యే సతీష్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 100 శాతం వచ్చేలా కృషి చేయాలని కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రత్యేక అధికారిణి మనీలాకు ఆదేశించారు. కేజీబీవీల్లో పదో తరగతిలో కనీసం ఐదుగురికైనా 10కి పది రావాలని పిల్లలకు తెలిపారు. 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.25 వేల ప్రోత్సాహక బహుమతి అందిస్తామని మంత్రి తెలిపారు. సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు తీసుకునే సమయంలో అవసరమైన అల్పాహారాన్ని అందించడానికి రూ. 36 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హరీశ్​రావు తెలిపారు.

'పదో తరగతి విద్యార్థులు పత్తి ఏరేందుకు అస్సలు పోవద్దు...'

ఇదీ చూడండి: మంత్రివర్గ నిర్ణయం తప్పు ఎలా అవుతుంది:హైకోర్టు

Intro:TG_KRN_102_19_MANTHRI_SCHOOL BUILDING_OPENING_SAMIKSHA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన నూతన భవన సముదాయాన్ని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ విద్యాలయల ప్రత్యేక అధికారిని మనీలా తో మాట్లాడుతూ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని, కేజీబీవీ ల్లో పదవ తరగతిలో 10/10 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని విద్యార్థులు ఆబ్సెంట్ లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 25 వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందిస్తామని అన్నారు. అనంతరం హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట మండలాల ఎంఈఓ అర్జున్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా లో 10 వ తరగతి ఉత్తీర్ణత శాతంలో హుస్నాబాద్ ను మొదటి స్థానంలో నిలపాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు తీసుకునే సమయంలో అవసరమైన అల్పాహారాన్ని అందించడానికి 36 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హుస్నాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో 8 లక్షల రూపాయలు మంజూరు చేసి అవసరమైన ఫర్నిచర్ అందిస్తున్నామని, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న వేళలో విద్యార్థులకు అవసరమైన మధ్యాహ్న భోజనాన్ని 5 సంవత్సరాల వరకు అందిస్తానాన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను అభినందించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి కుటుంబాన్ని అభినందిస్తూ వొడితల ఇంటిపేరు కాకుండా అన్నదాత ఇంటిపేరు పెడితే బాగుంటుందని అన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తమ రెడ్డి గారిని కూడా పాఠశాల ఆవరణలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేయాలని కోరగా ఆయన కూడా పాత పాఠశాల భవనం కూల్చివేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని శుభం గార్డెన్ లో ఏర్పాటుచేసిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలలకు చెందిన పలు గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున 21 ట్రాక్టర్ లను సర్పంచులకు పంపిణీ చేశారు.

Body:బైట్స్

1) ఆర్థిక మంత్రి హరీష్ రావు

2) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

Conclusion:హుస్నాబాద్ లో నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించి, సమీక్షించిన మంత్రి హరీష్ రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.