సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులై.. యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. ఆన్ లైన్ రుణ సంస్థలు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటలోని మౌనిక కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మౌనిక మృతి పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల వేదికగా.. మైక్రో రుణాలు అందించే యాప్‌లపై సరైన అవగాహన లేక అమాయకులు బలి అవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ యూప్‌లో రుణం తీసుకుంటే అంతే సంగతులు