మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన వారు, అధికారులు మున్సిపల్ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చట్టంలో అంశాలను అతిక్రమిస్తే ఎవరైనా చర్యలకు బాధ్యులు కావలిసిందేనని హెచ్చరించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నూతన పంచాయతీరాజ్ చట్టంపై మున్సిపల్ ఛైర్మన్లకు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, నియోజకవర్గంలోని మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.