సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకను ఆదర్శంగా నిలిపి... ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు నిలబెట్టాలని సూచించారు. కొత్త గ్రామ నిర్మాణానికి ముందుకొచ్చిన చింతమడక గ్రామస్థుల ఐక్యత హర్షనీయమని మంత్రి కొనియాడారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక మధిర గ్రామాలైన అంకంపేట, దమ్మ చెరువు, చింతమడకలో గ్రామ పునర్నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ మేరకు చింతమడక గ్రామానికి మంత్రి చేరుకోగానే గ్రామస్థులు, యువత మంత్రిపై గులాబీల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులతో అడుగడుగునా నీరాజనం పట్టారు. స్వయం ఉపాధి కోసం ఇచ్చే రూ.10 లక్షలు దశల వారీగా అందిస్తున్నట్లు, అందరూ ఒకే విధమైన అంశాన్ని ఎంచుకోవద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఫౌల్ట్రీ ఫామ్, డైరీ ఫామ్, వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలని, గ్యాస్‌తో నడిచే వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు. అంకంపేటలో 45, దమ్మ చెరువులో 55 గుడిసెలు నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు దమ్మ చెరువు గ్రామ ప్రజలతో కలిసి గుడిసెలు పరిశీలించి అన్నీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఇవీ చూడండి: పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ