సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. మళ్లీ కరోనా మహమ్మారి పెరుగుతుందని... ప్రజలు జాగ్రత్త పాటించాలని సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 2కోట్ల 15లక్షల రూపాయలతో సిటీ స్కానింగ్ సెంటర్ను, 2 కోట్ల 40లక్షలతో ఐసీయూ సెంటర్ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ లేనందున స్కానింగ్ కోసం వచ్చిన ప్రజలు హైదరాబాద్కి వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని... వారికి ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలు సిటీ స్కాన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని సూచించారు.
ఇదీ చూడండి: ఒక్క ఫోన్ కాల్ నా జీవితాన్నే మార్చేసింది..!