నియంత్రిత సాగు విధానం ద్వారా రైతుల ఇంట లాభాలపంట పండటం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జోస్యం చెప్పారు. కాళేశ్వరం జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు పంటలు పండుతాయని అన్నారు.
సిద్దిపేట జిల్లా ఇర్కోడ్‌లో కోటి 50 లక్షలతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం 3 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ అదనపు భవనానికి భూమిపూజ చేశారు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలనే డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రభుత్వం కట్టిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించండి: మంత్రి ఎర్రబెల్లి