సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా తెరాసలో చేరిన నాయకులకు పార్టీ కుండువా కప్పి మంత్రి ఆహ్వానించారు.
"రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా బియ్యం ఇచ్చాం. పింఛను, రైతు బంధు కూడా అందించాం. ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఇళ్లను కూడా అందిస్తాం. ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ మంజూరు చేశాం. గ్రామాల్లో గుడిసెలు లేకుండా తీర్చిదిద్దుతాం.
కేంద్ర వ్యవసాయబిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర వ్యవసాయబిల్లు రైతుల వ్యతిరేక బిల్లు అంటూ చాలా ఆందోళనలు చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఒక కేంద్రమంత్రి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం నెలరోజుల్లో అమల్లోకి వస్తుంది. భూ సమస్యలన్నీ పరిష్కరించి కొత్త పాసుపుస్తకాలు అందిస్తాం."
- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
ఇదీ చూడండి: భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ