సిద్దిపేట జిల్లాలో రబీ పంటకు ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ క్రిమిసంహారక మందులు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎరువులు, ఇన్పుట్ డీలర్లకు శిక్షణ, ధాన్యం కొనుగోళ్లు అంశంపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ఉత్సాహంగా పని చేయాలని ఏఈఓలకు ఆయన సూచించారు. చిరుధాన్యాల సాగు ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటు చేసే దిశగా తమవంతు కృషి చేయాలని కోరారు. రైతుబంధు, రైతుబీమా, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వంటి పథకాల గురించి సమీక్షిస్తూనే.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు సకాలంలో రైతు బీమా చేయించాలని వెల్లడించారు.
ఇవీ చూడండి: జీతాల కోసం కాదు... ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె"