సిద్దిపేట క్రికెట్ మైదానంలో మంత్రి హరీశ్ రావు మరోసారి క్రికెటర్ అవతారమెత్తారు. సినీ నేపథ్య గాయకుడు రేవంత్‌తో జోడీగా క్రికెట్ ఆడారు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన మంత్రి.. 22 (4×4) పరుగులతో క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సిద్దిపేట క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి టీహెచ్‌ఆర్-11 - హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కమ్ టాక్స్ విభాగం (ఐఆర్‌ఎస్) డే అండ్ నైట్ టీ-20 మ్యాచ్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీహెచ్‌ఆర్ జట్టు 159/7 చేయగా.. ప్రత్యర్థి జట్టు తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. 149/8 పరుగులతో సరిపెట్టుకుంది.
ఐఆర్‌ఎస్ జట్టుకు సారథిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రధాన కమిషనర్ జె.బి.మహాపాత్ర వ్యవహరించారు. మరోవైపు మ్యాచ్ మధ్యలో సింగర్ రేవంత్ సందడి చేశారు. మంత్రి పక్కన కూర్చొని మీకు నచ్చిన పాట చెప్పండంటూ నవ్వులు విరబూయించారు. పాటలు ఆలపిస్తూ క్రీడాకారులు, శ్రోతలను మైమరిపించారు. పలువురు యువకులు స్వీయచిత్రాలు దిగారు. అనంతరం మ్యాచ్‌లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు. సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.
- ఇదీ చూడండి : క్రికెటర్ అవతారమెత్తిన మంత్రి హరీశ్