ETV Bharat / state

'గోదారమ్మను బస్వాపూర్​కు తెస్తాం.. సస్యశ్యామలం చేస్తాం'

author img

By

Published : Feb 4, 2021, 9:49 AM IST

గోదారమ్మ నీళ్లతో బస్వాపూర్ చెక్​డ్యామ్​తో పాటు శనిగరం ప్రాజెక్టును నింపి కోహెడ మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బస్వాపూర్​లో రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే సతీశ్ కుమార్​తో కలిసి ప్రారంభించారు. రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకొని అధిక లాభలను ఇచ్చే మిర్చి, ఆయిల్ ఫామ్ లాంటి పంటలను పండించాలని కోరారు.

Minister Harish Rao participated in various development projects in Koheda mandal at Siddipet district.
'గోదారమ్మను బస్వాపూర్​కు తెస్తాం.. సస్యశ్యామలం చేస్తాం'

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బస్వాపూర్​లో రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం నీళ్లతో బస్వాపూర్ చెక్ డ్యామ్​తో పాటు శనిగరం ప్రాజెక్టును నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

బుక్కెడు తాగు, సాగు నీరు కోసం బాధపడ్డ బస్వాపూర్, కోహెడ మండల ప్రజల ఇబ్బందులు తొలిగాయని మంత్రి అన్నారు. వానలు పడ్డా పడకపోయినా బస్వాపూర్ చెక్ డ్యామ్​ను గోదారమ్మ నీళ్లతో మత్తడి పోయించి... రైతులు రెండు పంటలు పండించేలా చేస్తానని తెలిపారు. గతంలో కోహెడ, బస్వాపూర్ ప్రాంత రైతులు కోట్ల రూపాయలు పెట్టి బోర్లు వేసినా నీరు పడకపోవడంతో బతుకుతెరువు కోసం బొంబాయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్లేదని... ఇకపై అలాంటి సమస్య ఉండదని తెలిపారు.

మరికొన్ని రోజుల్లో గోదావరి నీళ్లు ఈ ప్రాంతంలో పారుతూ బోర్ల నిండా సమృద్ధి జలాలు ఉంటాయని హరీశ్ రావు అన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకొని అధిక లాభలను ఇచ్చే మిర్చి, ఆయిల్ ఫామ్ లాంటి పంటలను పండించాలని కోరారు. కోతులు పంటకు నష్టం చేయకుండా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నామని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ.. మెట్రో.. ఎంఎంటీఎస్‌.. సమన్వయం అడగొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.