సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక కోమటి చెరువులో విహరించారు. ఆయన సతీమణి మహిళలతో బతుకమ్మ ఆడారు.
రాష్ట్ర ప్రజలకు మంత్రి... బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని మంత్రి సూచించారు. బతుకమ్మకు పూజలు చేసి చెరువులో వదిలిపెట్టారు.