సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పర్యటించారు. కేజీబీవీ విద్యాలయం, కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిరుదొడ్డిలో పల్లెప్రగతి, విద్యా ప్రగతి రెండింటిని జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం మిరుదొడ్డి మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వివిధ శాఖల అధికారులను వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
కేజీబీవీ విద్యాలయ విద్యార్థులు, మోడల్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతిలో 10 జీపీఏ సాధించాలని, సాధించిన వారికి రూ. 25 వేల ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, తెరాస ప్రభుత్వ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మిరుదొడ్డి సర్పంచ్ రాములు, ఎంపీపీ గజ్జల సాయిలు, తెరాస తెలంగాణ కార్యకర్తలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : రామునికి భక్తితో... భక్తుడి హంస వాహనాలు