ETV Bharat / state

శ్మశాన వాటికను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటలో శ్రీరామకుంట్ల శ్మశానవాటికను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పరిశీలించారు. పిడకలు, కర్పూరం నెయ్యి వంటి వాటితో అంత్యక్రియలు జరిపేలా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మంత్రి సూచించారు.

Minister Harish rao inspected the cemetery at siddipet
శ్మశానవాటికను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
author img

By

Published : Feb 9, 2020, 3:58 PM IST

సిద్దిపేటలోని శ్రీరామకుంట్ల శ్మశానవాటికను మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా పర్యటించారు. శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులు‌ చేపట్టాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలన్నారు. ఎక్కడా కూడా చెత్త, పిచ్చి మొక్కలు కనపడకూడదన్నారు. పిడకలు, కర్పూరం నెయ్యి వంటి వాటితో అంత్యక్రియలు జరిపేలా ప్రోత్సహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.

హైదరాబాద్ నగరంలోని మహాప్రస్థానం, ఇతర ప్రాంతాల్లోని శ్మశాన వాటికల నిర్వహణ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. వాటికి భిన్నంగా శ్రీరామకుంట్ల శ్మశాన వాటికను తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. రాష్టానికే ఆదర్శంగా నిలిచేలా ఉండాలని అందుకు తానూ పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు.

శ్మశానవాటికను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

ఇదీ చూడండి : తేనెటీగల దాడిలో దివ్యాంగుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.