సీఎం కేసీఆర్ శ్రీరాముడు వలె ఉక్కు సంకల్పంతో ఆమరణ దీక్ష చేసి తెలంగాణా సాధించారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలోని తెలంగాణ భవన్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లా కార్యకర్తలతో హరీశ్‌రావు సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో తొలి పార్టీ సభ్యత్వాన్ని మంత్రి నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
"అన్నింటిలో ఆదర్శంగా ఉన్న జిల్లా.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదర్శంగా నిలవాలి. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు సిద్దిపేట. గులాబీ జెండా ఎగిరింది ఇక్కడే. ఉద్యమంలో, అభివృద్ధిలో ముందున్నాం. సభ్యత్వ నమోదులోనూ ముందుండాలి. ఉద్యమంలో ఎంతో మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం."
-హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి
'మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రం కోసం కేంద్ర మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలాగా వదులుకున్నం. జాతీయ పార్టీలకు దిల్లీలో బాస్‌లు ఉంటే.. తెరాస పార్టీకి తెలంగాణ ప్రజలే బాస్‌లు. ప్రజలకు సంక్షేమ పథకాల గురించి వివరించి సభ్యత్వ నమోదు చేయించాలి' అని హరీశ్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్ కుమార్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అవన్నీ లేకున్నా ప్రేమించిన వారితో ఆనందంగా గడపడింలా