రాష్ట్రంలో 591వ మండలంగా సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్టను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జిల్లాలు, మండలాల పునర్విభజనతో ప్రజలకు పరిపాలన చేరువైందన్నారు. మండల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రికి బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లతో స్థానికులు ఘనస్వాగతం పలికారు. ధూళిమిట్ట సెక్షన్ సహాయ ఇంజనీర్, తహసీల్దార్ కార్యాలయాలను హరీశ్ రావు ప్రారంభించారు.
ధూళిమిట్టను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అన్నివిధాలా సహకారం అందిస్తానని మంత్రి హమీ ఇచ్చారు. దేశంలో తెలంగాణలో మినహా మరెక్కడా ఏడాదికి 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి కోసం క్రమం తప్పకుండా ప్రతి ఏడు 15వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. సన్న వడ్లకు మళ్లీ డిమాండ్ పెరిగిందని.. మంచి ధర ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అనిశా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్‌సింహ