పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో.. ఉచితంగా అల్పాహారం, త్వరలోనే స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని శిక్షణార్థులకు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉచిత శిక్షణ పొందుతున్న 230 ఉద్యోగార్థులకు భరోసానిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట మల్టీ పర్పస్ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీసు నియామక ఉచిత శిక్షణ కేంద్రంలో ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. రాత పూర్వక పరీక్షలకు సైతం శిక్షణ ఇస్తామని తెలిపారు. అదే విధంగా 3 నెలల సమయం తర్వాత కావాల్సిన ఫిజికల్ శిక్షణ సైతం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటితో పాటు మైదానంలో రన్నింగ్ ట్రాక్, హై జంప్, లాంగ్ జంప్‌కు కావాల్సిన వసతులు సమకూరుస్తామని హామీనిచ్చారు.
ఈ మేరకు మంత్రి శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులతో కలిసి ముచ్చటించారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు... ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా వారితో కలిసి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని 14,28 వార్డుల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు