సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. హరీశ్ సమక్షంలో 216 మంది రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దింటి గృహాలకు దీటుగా పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాం. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల వసతులు కల్పించాం. నయా పైసా ఖర్చు లేకుండా.. పేదలకు నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేయిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విధాలుగా లబ్దిదారులు అభివృద్ధి చెందాలి. కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కిరాయికి ఇచ్చినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇళ్లు తిరిగి స్వాధీనం చేసుకుంటాం.
- హరీశ్‌రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఇవీచూడండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ..!