Staff Nurses Upgradation to Nursing Officers Telangana : స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్(Nursing officers) చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. నేటి నుంచి వారిని నర్సింగ్ ఆఫీసర్లుగా పిలవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) పేర్కొన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన.. 1000 పడకల ప్రభుత్వ ఆస్పత్రి(1000 Beds Govt Hospital at siddipet)ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.
Harish Rao Inaugurated 1000 Beds Hospital in Siddipet : రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అపోలో, యశోద వంటి కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దాదాపు 100 ఐసీయూ బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్లు, 30 ఎమర్జెన్సీ పడకలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. రూ.15 కోట్లతో క్యాన్సర్ బ్లాక్‌కు శంకుస్థాపన చేశామన్నారు. గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ఏ చికిత్స కోసమైనా ఇక నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
TS Govt Decision to Upgrade Staff Nurses to Nursing Officers : మరోవైపు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకునేందుకు దేశ రాజధాని దిల్లీ నుంచి సైతం విద్యార్థులు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత మెదక్ సీఎస్‌ఐ చర్చి మైదానంలో నిర్వహించే బీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి పాల్గొననున్నారు.
Harish Rao Inaugurates Arete Hospital : 'అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా తెలంగాణ మారనుంది'
"ఒకప్పుడు డాక్టర్ చదవాలంటే.. డబ్బులు ఉన్నవాళ్లే చదువుకోవాలి. కోటీశ్వరులే చదువుకోవాలని ఉండేది. తల్లిదండ్రులు డాక్టర్లు అయితే పిల్లలు డాక్టర్లు అవుతారని అనుకునేవారు. కానీ సీఎం కేసీఆర్ హయాంలో కూలీల పిల్లలను కూడా డాక్టర్లను చేస్తున్నారు. పేదవారి పిల్లలు, రైతుల పిల్లలు కూడా డాక్టర్లు అయ్యేంత గొప్పవారు అవుతున్నారు. వైద్యరంగంలో ఒక సరికొత్త విప్లవాన్ని సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నుంచి స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది." - హరీశ్‌రావు, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి
Harish Rao started Mudiraj AC Convection Hall at Siddipet : అలాగే సిద్దిపేటలో ముదిరాజ్ ఏసీ కన్వెన్షన్ హాల్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. కన్వెన్షన్ హాల్‌లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముదిరాజ్‌లకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులను కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్‌లకు రాజకీయంగా అవకాశం ఇస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.