ETV Bharat / state

ప్రజల బాధలకు ఉపశమనం కల్పిస్తున్నాం :హరీశ్​రావు - తెలంగాణ తాజా వార్తలు

సిద్దిపేట పట్టణంలో వీధి కుక్కల నియంత్రణ కేంద్రం, వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాన్ని మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. రెండో విడత గొర్రెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలను గొల్ల కురుమలకు ఆయన పంపిణీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే బాధల నుంచి ఉపశమనం కల్గిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

minister harish rao, siddipet latest news
ప్రజల బాధలకు ఉపశమనం కల్పిస్తున్నాం :హరీశ్​రావు
author img

By

Published : Apr 10, 2021, 10:44 PM IST

కుక్కల ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్​ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి హరీశ్​రావు చెప్పారు. సిద్దిపేట పట్టణంలో వీధి కుక్కల నియంత్రణ సెంటర్​ని ప్రారంభించి.. రెండో విడత గొర్రెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ పత్రాలను గొల్ల కురుమలకు అందించారు. వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించిన కార్యక్రమంలో.. జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Launch of Animal Birth Control Unit
ఎనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్​ ప్రారంభం

ప్రజలకు ఇబ్బంది కలిగించే కోతుల బాధ నుంచి ఉపశమనం కలిగించామని... వీధి కుక్కల బెడద కూడా లేకుండా చేశామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. 60 లక్షల రూపాయలతో ఎనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్​ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటి సంతతిని ఆపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అందుకోసం రెండు వాహనాలు, కుక్కలను పట్టడానికి ఆరుగురు వ్యక్తులను నియమించినట్లు తెలిపారు. కుక్కలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని సంరక్షిస్తామని అన్నారు.

insurance documents for gollakurumas
గొల్ల కురుమలకు ఇన్సూరెన్స్ పత్రాలు అందజేత

270 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించామని.. ఇక నుంచి దోమలు, ఈగల బెడద ఉండదన్నారు. తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని.. ప్రజల అవసరాలు తీర్చడానికి మున్సిపాలిటీ పని చేస్తుందని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి : కరోనా బాధితురాలిని ఇంట్లోకి అనుమతించని యజమాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.