సిద్దిపేట జిల్లా ఆర్డీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. బడ్జెట్ ఉన్నా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆలస్యం కావడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు మండలాల వారిగా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో తెలుసుకున్నారు. సంతకాలు పూర్తైనా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అనంతరం అర్హులైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇది దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి అద్భుత కార్యక్రమమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన 74 మందికి 74 లక్షల 8 వేల584 రూపాయలు చెక్కు అందించారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్