ETV Bharat / state

కాంగ్రెస్​, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్​ రావు - మంత్రి హరీశ్​ రావు తాజా వార్తలు దౌల్తాబాద్​

కాంగ్రెస్, భాజపాలు రెండూ రెండేనని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ఒకటి కరెంటు ఇవ్వక రైతులను ఇబ్బందులకు గురి చేస్తే.. మరొకటి మీటర్లు బిగించి రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ మండలంలోని ద్విచక్ర వాహన ర్యాలీ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

కాంగ్రెస్​, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్​ రావు

author img

By

Published : Oct 8, 2020, 8:07 PM IST

కాంగ్రెస్​, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్​ రావు

కాంగ్రెస్, భాజపా పార్టీలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విరుచుకుపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కరెంటు ఇవ్వక ఇబ్బందులపాలు చేస్తే.. నేడు కేంద్రంలో ఉన్న భాజపా వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు బిగించాలని చూస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాగంగా దౌల్తాబాద్ మండలంలోని ద్విచక్ర వాహన ర్యాలీ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

minister harish rao fires on congress and bjp parties about their development
ద్విచక్ర వాహన ర్యాలీలో మంత్రి హరీశ్​ రావు

మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోలేరు..

నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టాల గురించి సభలో మంత్రి హరీశ్​ రావు వాటి ప్రతులను చదివి వినిపించారు. వాటి సారాంశాన్ని క్లుప్తంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తోందన్నారు. కార్పొరేట్​ చేతుల్లోకి వెళితే తమ ధాన్యాన్ని తాము అమ్ముకునే వీల్లేకుండా ఉంటుందన్నారు. ఆ సంస్థలు చెప్పిన విధంగానే రైతులు వినే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.

వాళ్లను దుబ్బాక ప్రజలు నమ్మరు..

దుబ్బాక నియోజక వర్గంలో నాలుగుసార్లు గెలుపొందిన ముత్యంరెడ్డి కనీసం గ్రామాల్లో తాగునీటి సమస్యను కూడా తీర్చలేక పోయారని మంత్రి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రామలింగారెడ్డి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు హడావుడి చేసి గ్రామాల్లో తిరిగి వెళ్లే నాయకులను.. దుబ్బాక ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. స్థానికంగా ఉండే రామలింగారెడ్డి సతీమణి సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, భాజపా డిపాజిట్లు గల్లంతుకావడం ఖాయమన్నారు.

ఇదీ చదవండి: దుబ్బాకలో తెరాస గెలుపు ఖాయం.. రెండో స్థానంలో ఎవరుంటారో..: హరీశ్​రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.